Wednesday, April 6, 2011

'సత్యసాయి' దేవుడన్నారే !

ఇప్పుడేమో దేవుడే దిక్కంటున్నారు !!

ప్రస్తుతం రాష్ట్రంలో ఒక వార్త హాట్‌ హాట్‌గా ప్రచారంలో ూంది. సత్యసాయి ఆరోగ్యం ఆందోళనకరంగా ూందని తెలియడంతో ఆయన భక్తులే కాదు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్‌లు... సారీ.. సారీ.. వీళ్లు కూడా ఆయన భక్తులే కదా... సరే వీరంతా తీవ్ర ఆందోళనలో ూన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎనకటికేదో సామెత చెప్పినట్లు మొన్నటి వరకు దేవుడిగా పూజలు అందుకున్న, ప్రచారం పొందిన శ్రీ సత్యసాయిగారు ప్రస్తుతం దేవుణి కరుణ కోసం వేచి చూస్తున్నారని వినికిడి. ఆయన భక్తులు సైతం సత్యసాయికి సెలవు ప్రకటించి(పాపం ఆరోగ్యం బాగాలేనందున సెలవు ఇచ్చారేమో) వేరే దేవుణ్ణి మొక్కుతున్నారట. విది ఎంత విచిత్రం. ఎదో సినిమాలో ఒక డైలాగును గుర్తు చేసుకోవటం ఈ సందర్భంగా ఎంతైనా సముచితమెమో... 'ప్రపంచం చాలా చిన్నది. ఎన్నడో ఒకరోజు నీకు నా అవసరం రాక తప్పదు'.. నిజంగా ఈ డైలాగ్‌ సత్యసాయి(బాబా)కు, ఆయన పరమ భక్తులకు బాగా సరిపోతుంది. అయినా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, దేశ, రాష్ట్ర ప్రధమ పౌరుడు/పౌరురాలిగా ూన్న పలువురు వ్యక్తులు, ూన్నత చదువుల చదివిన అధికారులు సత్యసాయి కాళ్లు మొక్కడం ఎంత వరకు సమంజసమో ఇప్పటికైనా ఆలోచించుకోండి. రామాయణం, మహాభారతం, భాగవతం, ఖురాన్‌, బైబిల్‌ లాంటి ఇతిహాసాల గాధలను అపహస్యం చేయలేం. అలా అని అందరూ నమ్మరు. ఎవరి విశ్వాసాలు వారివి. కానీ ఇలాంటి బాబాల విషయంలోనే ప్రజలు పునరాలోచించుకోవాలి. అయన మీద మాకు ఏలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. కానీ చిన్న చిన్న బాబాలు, సత్యసాయికి తేడా ఏమిటి? ఎవరి స్థాయిలో వారు ప్రజలను మోసం చేస్తున్నారు. కాకపోతే తనకొచ్చిన ఆర్థిక, హంగ బలంతో సత్యసాయి పలు కళాశాలలను, ఆసుపత్రులను, సేవ కార్యక్రమాలను ప్రారంభించారు. రోడ్డు పక్కన ూండే ఏ బాబాకూ కోట్లకు కోట్లు వస్తే వారు కూడా ఎంతో కొంత సేవ చేస్తారు. ముందు ఇలాంటి పెద్ద బాబాలు, తరువాత చిన్న బాబాలు, అటు తరువాత చేతబడి, బాణామతి మంత్రగాళ్లు వీళ్లందరూ వాస్తవం కాదని గుర్తించేందుకు ఇప్పటికైనా మనమందరం ముందుకు వస్తే, మూడ హత్యలను, ఆత్మబలి లను నివారించవచ్చు.
కొంతమంది బాబా భక్తులు తమ దగ్గరకు వస్తుండడంతో ఇతర దేవుళ్లు(బాబాలు) తమ అవసరం ఇప్పుడు తెలిసిందా? అని నవ్వుకుంటున్నారట. పాపం ఆ ఇతర దేవుళ్లు(బాబాలు) ఎన్నడో ఒకరోజు ఇంకో దేవుణ్ణి నమ్ముకోక తప్పదు. చివరికి ఏ దేవుడైనా ప్రాణం మీదకు వచ్చేసరికి ప్రజల దగ్గరికే లఘేత్తుకొస్తాడు. అదే నండి వైద్యశాస్త్రాన్ని చదువుకున్న వైద్యుని వద్దకు....అసలు ఈ దేవుళ్ల పురాణానికి అంతముండదా అంటే ఎందుకుండదు.. మనమంతా మనుషులమని గుర్తించినప్పుడు కచ్చితంగా ూంటుంది...ఏమంటారు... నేనైతే మనిషినే.. నా చుట్టూ ూన్న వారు మనసున్న మనుషులేనని నేను నమ్ముతున్నాను. మరి మీరు????

8 comments:

  1. /నేనైతే మనిషినే.. నా చుట్టూ ూన్న వారు మనసున్న మనుషులేనని నేను నమ్ముతున్నాను. మరి మీరు???? /
    మీ చుట్టూ వున్న వాళ్ళు మాత్రం మనుషులే, మీ విషయం నాకు తెలవదు :)) :P
    వామవాదులకేల దేవుడి మీద చింత?!

    ReplyDelete
  2. బాబా తనకొచ్చిన ఆర్థిక, హంగ బలంతో సత్యసాయి పలు కళాశాలలను, ఆసుపత్రులను, సేవ కార్యక్రమాలను ప్రారంభించారు అని మీరే అన్నారు కదా?అందుకే ఇలా చేసే వారెవరినైనా "మనుషుల్లో దేవుడు"అనొచ్చు.

    ReplyDelete
  3. ఈ వార౦ లొ ఇ౦డియన్ ఎ౦బసీ దగ్గర ఒకరు మాటల్లో, సాయి మీ ఆ౦ధ్రా కదా అన్నారు. కాదు అని నేను ,షిరిడీ కదా. ఇ౦తకి వారు అడిగినది 'సత్య ' సాయి అని :)

    అవును 'వై యెస్ ఆర్ బాబా' కూడా బోలెడన్ని చేశారు. జలయజ్ణ౦,ఇళ్ళు, విద్యార్దుల ఫీజులు, ఆరోగ్యశ్రీ..ఇ౦కా యెన్నో. (ఆ పేరు తో వెనకేసుకొన్నయ్యి ఎవరికి లెక్క) ఈయన రాముడు, సత్య క్రిష్ణుడు.

    ReplyDelete
  4. అందరూ మనుషులని మీరు నమ్మితే అన్నిజీవులూ దైవ స్వరూపమని(మీరంటున్న మనుషులతో సహా అన్ని జీవులూ) కొందరు నమ్ముతారు.ఏ మనిషి మాట కానీ,జీవనవిధానంకానీ సమాజానికి హానికరం కానంతవరకూ వారినిపనికట్టుకొని విమర్శించనవసరం లేదు.

    ReplyDelete
  5. అందరూ దైవస్వరూపాలైతే ఆలెక్కన అసలు ఎవ్వరినీ విమర్శించొద్దు. మరి ఎందుకు కొందరు బాబాలను దేవుడు కాదని విమర్శించినవెంటనే ఈవాదన ఎత్తుకుంటారు, బ్లాగుల్లో మిగతా ఎవరినీ ఎన్ని తిట్టినా మాట్లాడనివారు? ఈలెక్కన కసబ్ కూడా దైవస్వరూపమేమో, వదిలేద్దామా?

    ReplyDelete
  6. అమర్‌గారు మీరు నేను రాసిన కామెంట్ పూర్తిగా చదవనేలేదు.
    కసబ్‌ని సత్యసాయితో పోల్చటం మీకు ఆనందం కలిగిస్తే అలాగే చేయండి.ఇంకా కావాలంటే గాడ్సేని గాంధీ తో పోల్చండి.ఈ సృష్టిలో మానవ మేధస్సు అర్ధం చేసుకోగలిగింది చాలా తక్కువ.సృష్టి పై అవగాహన పెరిగేకొద్దీ మనిషి దైవత్వం వైపు ప్రయాణిస్తాడు.ఏదైనా ఒక విషయం సత్యమా అసత్యమా అన్న విషయం చెప్పగలగాలంటే దానిపై పూర్తి అవగాహన ఉండాలి కదా.ఈ హేతువాదులకు అదేమీ అవసరం లేదు. వీరిదృష్టిలో సఫాయ గారిలాంటి కాకలు తీరిన డాక్టర్లు కూడా అవివేకులు,అంధవిశ్వాసులు.అలా చెప్పటానికి వీళ్ళకు ఉన్న క్వాలిఫికేషన్ ఏమిటని మాత్రం ఎవ్వరూ అడగకండి.

    ReplyDelete
  7. /*ఇంకా కావాలంటే గాడ్సేని గాంధీ తో పోల్చండి.*/

    అలా అన్నది మీరే. ఇంకా అన్ని జీవులూ అని కూడా అన్నారు. ఒక పందికొక్కు ఏం చేస్తే దైవత్వాన్ని పొందగలదో సెలవిస్తారా?

    /*ఏదైనా ఒక విషయం సత్యమా అసత్యమా అన్న విషయం చెప్పగలగాలంటే దానిపై పూర్తి అవగాహన ఉండాలి కదా*/

    అంత అక్కరలేదు, బుర్రకాస్త ఉపయోగిస్తే సరిపోతుంది. అతన్ని దేవుడని నమ్మేవారికి బుర్రలేదని కాదు కానీ కొన్ని విషయాలపై ఎక్కువ ఆలోచించాలన్నా, ప్రశ్నించాలన్నా కొందరికి భయం అంతే.

    /*వీరిదృష్టిలో సఫాయ గారిలాంటి కాకలు తీరిన డాక్టర్లు కూడా అవివేకులు,అంధవిశ్వాసులు*/

    మీదృష్టిలో ఈక్రింది లిస్టులో ఉన్నవారంతా అవివేకులని అర్ధమా? అలాగ మీరనుకుంటారని నేననుకోను. ఇక సఫాయా గారికి ఏ పర్సనల్ అజెండా ఉందో ఎవరికి తెలుసు, అసలే లక్షకోట్లవ్యవహారం.
    http://en.wikipedia.org/wiki/List_of_atheists_in_science_and_technology

    /*అలా చెప్పటానికి వీళ్ళకు ఉన్న క్వాలిఫికేషన్ ఏమిటని మాత్రం ఎవ్వరూ అడగకండి.*/

    వారిని హేతువాదులని మీరే అన్నారుకదా? హేతువుకోసం వెతకడమే వారి క్వాలిఫికేషన్.

    /*ఈ సృష్టిలో మానవ మేధస్సు అర్ధం చేసుకోగలిగింది చాలా తక్కువ*/

    అలాంటి అపోహలేం పెట్టుకోకండి. మనిషి అర్ధం చేసుకునే విషయాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉంటాయి. అర్ధం చేసుకునే ప్రయత్నం చేసే ధైర్యం, ఓపిక, జిగ్నాస లేని వారు మాత్రం తమకు అర్ధం కాని అన్నివిషయాలకూ కారణం దైవంలో వెతుక్కుంటారు. నిన్న అర్ధం కాని విషయం ఇవ్వాల అర్ధం అవుతుంది, ఇవ్వాల అర్ధం కాని విషయం రేపు అర్ధం అవుతుంది అయినా కొందరు మరో వెయ్యేల్లతరువాత కూడా మనకు తెలిసింది తక్కువ, తెలియనిదానికి కారణం దేవుడే అనుకుంటారు, ఏంచేస్తాం?

    ReplyDelete
  8. మీరిచ్చిన అథీయిస్ట్స్ లిస్ట్ బాగుంది.వేళ్ళపై లెక్కపెట్టకల వాళ్ళలిస్ట్ తయారు చేయటం సులభమే మరి.అయినా మీలిస్ట్ లో న్యూటన్, గ్రాహం బెల్, మేడం కూరీ లాంటి ప్రముఖులెవరూ లేరేంటో మరి.ప్రపంచంలో ఉన్న అసంఖ్యాకమైన థీయిస్ట్స్ లిస్ట్ తయారుచేయటం సాధ్యం కాదు కాబట్టి అది వికిపీడియాలో లభించదని గమనించగలరు.స్వస్తి.

    ReplyDelete