Friday, December 7, 2012

తెలంగాణ... పేరే కావాలి???

           తెలంగాణ ఐకాన్... వీరవనిత... తెలంగాణ తూర్పుముక్క.... ఇలాంటి మాటలు ఎన్నో.... ఫేస్ బుక్ లో తెలంగాణ వాదుల వీర ఫాలోయింగ్... విపరీతమైన కామెంట్లు... న్యూస్ రీడర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవార్డులను తొలిసారి అందుకున్న సదరు యాంకర్  అప్పటి వరకు ఎంతమందికి తెలుసో కానీ... అవార్డు వచ్చిన తర్వాత మాత్రం పైన చెప్పిన హంగామాతో తెలంగాణలో ఆమెకు విపరీత ప్రచారం కల్పించారు. ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్ లు... టీవీలు, పేపర్లో యాడ్స్... జనాలకు ఇంత వేలం వెర్రి ఎందుకో అర్థం కాలేదు. ఎదో.. స్టేజీ మీద రెండు మాటలు మాట్లాడగానే ఆమెలో కొంతమందికి వీరతెలంగాణం కనిపించింది. తీరా ఇప్పుడు చూస్తే... తెలంగాణవాదం పక్కన పెట్టిన ఆమె రెడ్ల పార్టీలో చేరారు. ఆమెను ఆకాశానికెత్తిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో? తెలంగాణవాదం కన్న కులానికి, ఇతర అంశాలకు ప్రాధాన్యమిచ్చిన ఆ వనిత ఇంకా తెలంగాణ గురించి మాట్లాడడం శోచనీయం. పార్లమెంటులో సమైక్యాంద్ర ప్లకార్డును ప్రదర్శించిన జగన్ పార్టీ సరసన చేరిన ఆమె... తన రాజకీయారంగేట్రం తెలంగాణ కోసమేనంటే నమ్మే వెర్రి వాళ్ళు ఈ తెలంగాణలో ఎవడూ లేరు. ఇంకా నమ్మితే గొర్రే కసాయోన్ని నమ్మినట్లే. ఇక్కడ నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే. నిన్న జిట్టా బాలకృష్ణారెడ్డి, ఇవాళ ఆమె, రేపు ఇంకొకరు... ఇలా అందరూ తెలంగాణ వాదాన్ని వాడుకున్నది.. వాడుకుంటున్నది... తమ స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప తెలంగాణ కోసం కాదు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మేల్యేగా పోటీ చేయాలన్న పదవి కాంక్ష, ఆర్థిక ప్రయోజనాల కోసం సదరు యాంకర్ తెలంగాణావాదాన్ని తాకట్టు పెట్టారు. రేపు మళ్ళీ తెలంగాణ పేరుతోనే ఓట్లు అడగడానికి లో ఎటువంటి సంకోచం లేకుండా వస్తారు. 
          ఈ విషయాన్ని అమాయకులైన మా తెలంగాణ సోదరులు గుర్తించనంత కాలం ప్రతివాడు తెలంగాణ జెండా ఎత్తుకొని పబ్బం గడుపుకుంటూనే ఉంటాడు. మంత్రి పదవికి రాజీనామా చేసినా, ఐపిఎస్ గిరిని వదులుకున్నా... అన్నీ సొంత లాభాలకేనన్నది వాస్తవం. గీడ నిజమైన తెలంగాణ వాదులు ప్రజలే.. నాయకులు కాదు.. అందుకే తెలంగాణ పేరుతో పోటీ చేసే వారు ఓడిపోతే తెలంగాణవాదం ఎక్కడ వెనకపడి పోతుందోనన్న ఆందోళనతో వారి పుట్టుపుర్వోత్తరాలు చూడకుండా గెలిపించుతున్నరు. గెలిచిన వారు మాత్రం ప్రజల ఆకాంక్షను పక్కకు పెట్టి ఇతర అంశాలకు ప్రాధాన్యమిస్తున్నరు. ఈ ప్రపంచంలో స్వార్థం లేనివాడు ఎవ్వడూ లేడు. ప్రతివాడికి ఎదో రూపంలో స్వార్థం ఉంటూనే ఉంటుంది. అయితే భయటికి మాత్రం వీర ఫోజులు పెట్టడమే బాధాకరం. తెలంగాణ పేరుతో వంచించబడుతోన్న ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించాలి. ఎవ్వనికిబడితే వాడికి తెలంగాణవాదాన్ని అన్వయించుకోవద్దని మనవి.

3 comments:

  1. అవును చాలా మంది ఆమె ను అప్పుడు ఆకాశానికి ఎత్తారు.

    ఇల వృత్తులు ఎన్ని ఉన్నా...కుల వృత్తికి సాటి రావు గువ్వలచెన్నా...అని వెనకటికి ఒకాయన చెప్పాడు.

    అందుకే ఆ ధీర వనితకు...తమ కులం పార్టీనే అన్నిటి కన్నా గొప్పగా కనిపించి ఉండవచ్చు సరే అది వారి వ్యక్తిగతం.
    కానీ తెలంగాణపై జరిగిన అనేక చర్చల్లో.... సీమాంధ్రులను ద్రోహులు, దొంగలు అని పదే పదే గొంతు చించుకొన్న సదరు యాంకరిణి ( ఇదే కారణంతో గతంలో ఓ పత్రికకు చెందిన ఛానల్ నుంచి వైదొలగాల్సి వచ్చిందట ) తీరా తన స్వార్థం కోసం తెలంగాణ ద్రోహుల పంచన చేరడం చాలా బాధాకరం.

    జనాలు వెర్రివాళ్లు అమాయకులు అనుకొని ఉండవచ్చు. కానీ నర్సంపేట ( వారు పోటీ చేయాలనుకుంటున్న నియోజక వర్గం ) ప్రజలు చాలా చైతన్య వంతులు. ఒకప్పుడు ఓంకార్ ను వరుసగా గెలిపించారు. అటువంటి వారిని తక్కువ అంచనా వేయలేం కదా. పైకి ఎన్ని మాటలు చెప్పినా...ఎవరెన్ని వేషాలు వేసినా తెలంగాణ తోలు కప్పుకున్న వారి అసలు రంగు వచ్చే ఎన్నికల్లో బయటపడడం ఖాయం.

    ReplyDelete
  2. ఇది 1969 కాదు, ఇప్పుడు తెలంగాణా సోయికి వచ్చింది. మునపటి లక్క అందరిని నమ్మేటట్టు జనం లేరు. ఆదరిస్తే నెత్తికి ఎక్కించుకున్న జనమే ఆశయానికి ద్రోహం చేస్తే చీకోట్టడం ఖాయం. కెసిఆర్ నిరాహార దీక్ష ఆపినప్పుడు ఏమయిందో చూసినం కదా.

    మనకు కావాల్సింది తెలంగాణా రాష్ట్రం. అడ్డం పడ్దోడు ఎవడయినా మసి కావాల్సిందే. వాడవ్వెడు వీడెవ్వడు ఆవలి కెల్లగొట్టుడే.

    "దోపిడి చేసిన ప్రాంతేతరుడిని దూరం దాక తరిమేస్తం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణం తోనే పాతరేస్తం": ప్రజాకవి కాళోజీ నారాయణరావు.

    ReplyDelete
  3. telangana ni vadukonidi evado mundu chepali.. web portals kuda telangana peru tho dabulu jama chesukuntunaie... leaving it aside
    jitta telangan vadam gurinche eppudu matladakunda, jitta and even many others ni kalupukokunda udhyamum ela cheyali ani anukunaro kuda chepali
    telangana ante single man show kadu ani chepina valani rajayakiyanga anichevesthey valu evaru adaristaro vala dhegariki veltaru ane sangathi marichipovadu...

    ReplyDelete