Tuesday, October 8, 2013

సీమాంధ్ర మీడియా ఉద్యమం!!

      సమైక్యవాద ఉద్యమం పేరుతో సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల పట్ల మన మీడియా వైఖరి చూస్తుంటే సిగ్గేస్తుంది.. మీడియా సంస్థలు మరీ ఇంత దారుణంగా, పక్షపాతంగా వ్యవహరిస్తాయా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. నేను తెలంగాణలో పుట్టినా నాకు ప్రత్యేక కాంక్ష ఏనాడూ లేదు.. ఒక తెలంగాణ బిడ్డగా మా ప్రాంత ఉద్యమం పట్ల సాధారణ సానుభూతి తప్ప ప్రత్యేక అభిమానం లేదు. నాలో ఇంకా ఎంతో కొంత మిగిలి ఉన్న వామపక్ష భావాజాలం అందుకు కారణం కావచ్చు. కానీ తెలంగాణపై కేంద్రంలో అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ సానుకూల ప్రకటన చేసినప్పటి నుంచి సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం, దాన్ని మీడియా కవర్ చేసే పద్ధతి చూస్తున్నప్పటి నుంచి నాలో తెలంగాణవాదం బలపడుతుంది. నాకే కాదు సీమాంధ్రలోకృత్రిమ ఉద్యమం మొదలయినప్పటి నుంచి తెలంగాణ ప్రజల్లో ఉద్యమకాంక్ష మరింత బలపడిందనేది వాస్తవం. 
     అయితే ఇన్ని సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరవీరులయిన ఉద్యమం ఎప్పుడూ కర్ఫ్యూ వరకు వెళ్ళలేదు. లూటీలు జరగలేదు. కానీ సీమాంధ్రలో ఉద్యమం ముసుగులో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, లూటీలకు పాల్పడడం మనం చూస్తున్నాం. రాజీవ్ గాంధీ దారుణ హత్య, విజయవాడలో కొండవీటి మోహన రంగా హత్య సంఘటనల అనంతరం కూడా ఆ ప్రాంతాల్లో విచ్చలవిడిగా లూటీలు జరిగాయి.. ఏదైనా అల్లర్లు జరగగానే లూటీలకు పాల్పడడం ఆ ప్రాంతంలో కొంతమందికి అలవాటు లా ఉంది.. ఈ వైఖరి చూస్తే సీమాంధ్ర నేతలు దోపిడిదారులని తెలంగాణ వాదులు చేస్తున్న వాదన నిజమేనేమోనన్న అనుమానం కలుగుతుంది. 
       అయినా సంవత్సరాల తరబడి జరుగుతున్న ఉద్యమానికి కేంద్రం ఎదో ఒక రూపంలో ముగింపు పలికేందుకు ముందుకు రావడం నాకైతే సంతోషంగానే ఉంది.. అభివృద్ధి అనేది ఆయా ప్రాంతాలలో ఏర్పడే ప్రభుత్వాల వైఖరిని బట్టి ఉంటుంది తప్పితే.. విడిపోతే అభివృద్ధి చెందుతాం.. లేదంటే కలిసుంటేనే అభివృద్ధి సాధ్యం లాంటి వాదనలు వాస్తవం కాదనేది నాకున్న నిశ్చితాభిప్రాయం. అందుకే దీర్ఘకాలంగా ఉన్న తెలంగాణ ఉద్యమానికి ముగింపు పలికేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం, కేబినోట్ లో నోట్ పెట్టడం శుభపరిణామం. అయితే తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత సీమాంధ్రలో ఉద్యమం ప్రారంభం కావడం వెనక రహస్య ఎజెండా ఉందన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణపై ఎంతోకాలంగా చర్చ జరుగుతుంటే అప్పుడు నోరుమెదపని వారు తెలంగాణ ప్రకటన వచ్చాక హడావుడి చేయడం ఎంతవరకు సమంజసమో వారే తేల్చుకోవాలి. 
       సీమాంధ్రలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుందని ఊదరగొడుతున్న సీమాంధ్ర మీడియా.. అక్కడి ప్రజల అభిప్రాయాలను మాత్రం ప్రతిభింభించడంలేదని.. అక్కడివారే చెబుతున్నారు. చాలామంది ప్రజలు సమ్మెతో ఇబ్బంది పడుతూ ఉద్యమం మనకేందుకుని నిలదీస్తున్నారట.. కానీ అటువంటి వాటిని ప్రసారం చేయకుండా.. తాము చెప్పిన మాటలనే వల్లెవేసే వారి బైట్లు మాత్రమే ప్లే చేస్తున్నారు. మీడియా తలచుకుంటే తిమ్మినిబమ్మి చేయగలదన్న వాదన నిజమేనని సీమాంధ్ర ఉద్యమాన్ని చూస్తే నిజమేననిపిస్తుంది... మీరేమంటారు?

20 comments:

  1. తెలంగాణా లో కూడా మీలాగా చాలామంది ప్రత్యేక తెలంగాణా కోరుకోలేదు. అప్పుడు కూడా ప్రజలెవ్వరూ మాకు తెలంగాణా కావాలని అడగలేదు. కొంత మంది రాజకీయ నిరుద్యోగులు తమ ఉనికి కోసం ప్రజలని రెచ్చగొట్టి ఈ పరిస్తితి తీసుకొచ్చారు.ఇదివరకల్ల ఊరుకొని ఇప్పుడెందుకు గొడవ చేస్తున్నారు అని అందరూ అడుగుతున్నారు.రాజకీయ నాయకులు తెలంగాణ రాదు అని ప్రజలని మభ్య పెట్టారు. నాయకులని ఎన్నుకునేది తమ తరపున పార్లమెంటులో మాత్లాడతారని కాని వాళ్ళ లాభాలు చూసుకుంటారని కాదు కదా. తెలంగాణాలో కె సి ఆర్ జనాన్ని రెచ్చగొట్టాడు. ఇక్కడ ప్రజలు రాజకీయ నాయకులని అడుగుతున్నారు.
    మీరు న్యాయం ఆలోచించండి. మన ముఖ్యమంత్రులందరూ హైదరబాదుని డెవలప్ చేసేటప్పుడు అది రాష్త్రం మొత్తం కోసమని డెవలప్ ఛెసారు కదా. డెబ్బై రెండు తర్వాత కెసి ఆర్ వచ్చేవరకు ఎవరికీ ఆ ఆలొచనలెదు కదా. ఇప్పుడు ముప్పై నలభై లలో ఉన్నవాళ్ళకెవరికీ హైదరబాదు మనది కాకపోవఛ్ఛన్న ఆలోచన లేదు కదా. అందుకని వాళ్ళు ఇప్పుడు హైదరాబాదు మీది కాదు అంటే జీర్ణించుకోలెక పోతున్నారు.

    ReplyDelete
    Replies
    1. rendoa vidthaa vachinaa vudhyam KCR tho start kaledu adhi 1996 lo start ayyendhi kcr 2001 lo party pettindu . 1996 varaku telangana vudhyam roopamulo ledu kavachu kani bavana appudu vundhi .... alage bathuku poru appudu vundhi naxal vudhaymaa roopam lo ..dhanni anichevesinaa samymulo adhi malli telangana vudhyamam gaa malli paikilesindhi . ante inkaa cheppalante telangaan vudhyamam 1969 lo anichivesinaa tharuvatha aa unrest naxal movement gaa mari dhanni anichevesinaa tharuvathaa malli 1996 lo telangana vudhyamam gaa vachindhi

      Delete
  2. రంగరాయన్ గారి అభిప్రాయంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తాను. ఒక ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాన్ని కించపరచడం భావ్యం కాదు. అక్కడి ప్రజలను అవమానించడమే. హైదరాబాదు మనందరిది అనుకోవడమే ఇక్కడి ప్రజల తప్పా

    ReplyDelete
  3. ఎన్ని లూటీలు జరిగాయి?
    లూటీలు జరిగాయి అని, ఇక్కడి ప్రజలంతా ఉద్యమాలు వద్దని అన్నారని మీకు ఎవరు చెప్పారు? మీరు అట అని అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇక్కడి సామాన్య ప్రజలంతా ఉద్యమానికి అనుకూలంగానే ఉన్నారు. ఇబ్బందులు ఎదురవుతున్నా ఓర్చుకొంటున్నారు. కలిసి ఉందామన్న ఆకాంక్ష ప్రజల్లో చాలా బలంగా ఉంది.తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించాక తెలంగాణా లో ఉద్యమాలు ఏమయినా జరుగుతున్నాయా? లేదు కదా. ఎందుకంటే మనం ఒక సుస్థితి లో ఉన్నప్పుడు కానీ, మనం అనుకున్నది నెరవేరుతున్నప్పుడు కానీ ఉద్యమం చేయవలసిన అవసరం ఏమి ఉన్నది.

    ReplyDelete
  4. "ఎందుకంటే మనం ఒక సుస్థితి లో ఉన్నప్పుడు కానీ, మనం అనుకున్నది నెరవేరుతున్నప్పుడు కానీ ఉద్యమం చేయవలసిన అవసరం ఏమి ఉన్నది." avasramledu correct kani .. seemandhraa party lanni telangana istham antunte appudu emathram chappudu cheyakundaa ... abba mana nayakulu telangana vallanu enthaa baga mosam chesthunnaru ani sambraa padi theera itchinaa tharuvatha godava chesthe em labam vuntundhi ..... ఇబ్బందులు ఎదురవుతున్నా ఓర్చుకొంటున్నారు. evaru ibbandhi paduthunnaru govt schools govt hospitals , govt ration meedha adhraaa padda vadu thappa evadu ibbandhi paduthunnadu .... aa category lo nuvvu ravu anukuntaa .. alantapudu vallandhrii tharupunaa nuvvu ela cheputhavu

    ReplyDelete
  5. ఒక్కసారి తెలంగాణా ప్రకటన వచ్చాక మీ నాయకుల ప్రకటనలు చూసి మాట్లాడండి.. కేవలం ఇచ్చేస్తాము అన్న ప్రకటనకే ఇలా రెచ్చిపోతే రేపొద్దున్న తెలంగాణా ఏర్పడిన తర్వాత ఆ పార్టీ గుండాలు రెచ్చిపోయి హైదరాబాద్ లో వున్న తెలుగు వారిని కొట్టరని గ్యారంటీ లేదు..(మీరు తెలుగు వాళ్ళు కాదు అని మీరే అంటున్నారు కాబట్టి).. అందుకే వువ్వెత్తున లేచింది వుద్యమం.. ఒక్క గవర్నమెంట్ కాదు ట్రాన్స్ పోర్ట్ లేకపోవడం వలన, కరెంటు లేకపోవడం వలన ఎంతో మంది కార్మికులు, వ్యాపారస్థులు, విధ్యార్ధులు నష్టపోతున్నారు.. పెట్రోల్, నీళ్ళు, ఏ.టి.ఎం లలో డబ్బులు రాక అంతా ఇబ్బంది. బాంకులు కూడా తరచూ మూతబడుతున్నాయి.. కిరసనాయిలు వుందిగాని కాల్చుకోవడానికి అగ్గిపెట్టి దొరకని మీ నాయకుల వుద్యమం అంత మంచి వుద్యమం కాదులెండి..

    ReplyDelete
    Replies
    1. kottadaniki telugu variki sambadham enti ..... asalu kdotham ani evarinaa annaraa :(

      Delete
    2. చందు గారు ,
      ఫ్రస్ట్వేషన్ బాబాయి ఫ్రస్ట్వేషన్. ఫ్రస్ట్వేషన్ తో వోలేటి గారు రాసింది నాకయితే అర్హమే కాలేదు. వదిలేయ్

      Delete
  6. >>మీ నాయకుల ప్రకటనలు చూసి మాట్లాడండి

    ఏ ప్రకటన గురించి మాట్లాడుతున్నారు?

    ReplyDelete
  7. @rangarayan, @voleti, @vajram : తెలంగాణ ఉద్యమం కెసిఆర్ వచ్చాక రాలేదు బ్రదర్స్.. అది ఏళ్ళనాటి ఉద్యమం.. 1969లో 400 మంది విద్యార్థులు పోలీసు కాల్పులలో బలయ్యారు. ఇప్పటి ఉద్యమం కన్నా నాటి ఉద్యమం తెలంగాణ మదిలో ఎప్పటికి ఉంటుంది. మీకు తెలియకుంటే తెలుసుకొండి. ఇక్కడ అక్కడా కొంతమంది రాజకీయ అవసరాల కోసం ఉద్యమానికి సారధ్యం వహించి ఉండవచ్చు.. కాకపోవచ్చు.. కానీ తెలంగాణ ఆకాంక్ష ఓ అస్థిత్వ పోరాటం.. తమ అస్థిత్వాన్ని కొల్పోతున్నామన్న ఆవేదన నుంచి పుట్టింది. కావాలంటే చరిత్ర తిరగేయండి.. ఆంధ్రరాష్ట్రంతో తెలంగాణను కలిపేటప్పుడు ఎన్నీ నియమాలు రూపొందించారు.. ఎన్నీ పాటించారు. ప్రతి చోటా దగా పడింది తెలంగాణవారే.. ఇప్పటికైనా మా బతుకు మేము బతుకుతాం అంటున్నాం తప్పితే.. మిమ్ములను ఇక్కడి నుంచి వెళ్లమని చెప్పడం లేదు.. కావాలనే సీమాంధ్ర మీడియా అటువంటి వాటిని ప్రచారం చేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే.. ౨3 జిల్లాలున్న రాష్ట్రంలో 13 జిల్లాల ప్రజలు కలిసుండాలని భావిస్తే చాలా.. అసలు అది సమైక్య ఉద్యమం ఎలా అవుతుంది. సీమ+ఆంధ్ర = సీమాంధ్ర ఉద్యమం మాత్రమే.. సమైక్యవాద ఉద్యమం కాదు.. ఇక ప్రజలు అష్టకష్టాలు పడ్డారని మీరు చెబుతున్నారు. అవును ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉద్యోగాలు బంద్ పెట్టి ఉద్యమం పేరుతో కార్యాలయాలకు ఎగనామం పెడితే ప్రజలకు ఇబ్బందే ఉంటుంది. ముఖ్యంగా పేద, సామాన్యులకు.. నిజంగా చిత్తశుద్ది ఉంటే ప్రైవేటు సర్వీసులు ఎన్నీ నిలిచిపోయాయో మీరు చెప్పగలరా.. ప్రభుత్వంది కాబట్టి ఆర్టీసీని నిలిపివేశారు. మరీ కేశినేని, జెసి, వంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఎన్నీ సార్లు నిలిపివేశారు.. ఇదే సందని వారు ఇష్టమొచ్చినట్లుగా చార్జీలు పెంచి సీమాంధ్ర ప్రజల(అక్కడికి వెళ్ళేది ఎక్కువగా వారే కదా) రక్తం తాగలేదా?

    ReplyDelete
    Replies
    1. మీ ఉద్యమ నేత గారు కేంద ఉద్యోగుల కిచ్చే పే స్కేళ్ళు నేనిస్తానని ఆశపెట్టి ఉద్యొగుల్ని రెచ్చగొట్టి సమ్మెలు చేయించితే బలపడింది మీ ఉద్యమం. సీమంధ్రలో ఉద్యమ స్వరూపం అది కాదు. ఉద్యమ కాలంలో సీమాంధ్రుల్ని మీరు తిట్టిన తిట్లు - ముఖ్యంగా ఆంధ్రావాళ్ళు అని కనీస మర్యాద కూడా చూపించకుండా ఆంధ్రోళ్ళ్ళు అని నీచంగా మాట్లాడినా - అప్పటిదాకా యెలాగో సహించారు. సరే రాష్ట్రాన్ని సాధించుకోవాలనే ఉద్యమం వేడిలో అంటున్నారు లెమ్మనుకుని తొమ్మిదేళ్ళు మౌనంగా ఉండి పోయింది మీ ఉద్యమం పట్ల సహనం తోనే. కానీ ప్రకటన తెచ్చుకుని కొంత నిదానంగా హుందాగా ఉందాల్సిన ఈ టైములో కూడా మీ పాత ధోరణిని మీరు వదలటం లేదు. యే ఒక ప్రత్యేకమైన కారనం చెప్పకపోయినా అందరి మనసుల్లోనూ అదే భావన ఉండి అది ఇలా బయట పడింది. అర్ధం చహెసుకుని ఇకనించయినా మీరు ప్రశాంతంగా ఉండి మమ్మల్ని ప్రసాంతంగా ఉందనివ్వండి.

      Delete
    2. >>ఆశపెట్టి ఉద్యొగుల్ని రెచ్చగొట్టి సమ్మెలు చేయించితే బలపడింది మీ ఉద్యమం.

      మీ నుండి అంతకంటే ఎక్కువ మేమెప్పుడు ఆశించలేదు లే. తెలంగాణాలో దోపిడీకి అవకాశం పోతుందనే భయం తోనే ఈ సీమండ్రులు ఈ ఉద్యమాలు చేస్తున్నారని నేనుకూడా చాలా తేలిగ్గా అనగలను.

      >>ఆంధ్రోళ్ళ్ళు అని నీచంగా

      అంద్రోల్లు అని అంటే నిచమా? మీ తెలుగుకు ఓ నమస్కారం.

      >>ఇకనించయినా మీరు ప్రశాంతంగా ఉండి మమ్మల్ని ప్రసాంతంగా ఉందనివ్వండి.

      హహహ . అది మీ చేతుల్లోనే ఉంది మరి.

      Delete
    3. 1.విడిపోవటానికి కారణంగా మీకు జరిగాయని చెబుతున్న అన్యాయాల్ని ముందు ముందు చట్టసభల్లో జరగబోయే చర్చల్లో సమర్ధవంతంగా నిరూపించగలరా?యెందుకంటే మీరు అన్యాయాలు జరిగాయంటున్నారు నిజమే కానీ, నేను యెవరు మీకు అన్యాయం చేసింది? మీరు దోషిగా నిలబెడుతున్నదెవర్ని అని నేను యెన్నిసార్లు అడిగినా ఆ ప్రశ్నని మాత్రం దాటవేసి మిగిల్న వాటికి మాత్రం జవాబు చెప్పటం, లేదా నాకు చిలిపితనం అంటగట్టేసి తప్పించుకోవటం చేస్తున్నారు.ఒక అజ్ఞాత నన్ను పేరు పెట్టి సంబోధిస్తూ మీరు యేదైనా పార్టీకి పనిచేస్తున్నారా అని అవమానకరంగా మాట్లాడాడు.అటువంటి తీవ్రమైన అరోపణ చెయ్యదల్చుకున్న మనిషి అజ్ఞాతంగా ఉండటం నన్ను అవమానించినట్లేగా?తన ప్రశ్నలకి నేను జవాబు చెప్పాక నా ప్రశ్నలకి జవాబు చెప్పకపోవటం మరీ తీవ్రమయిన విషయం. మాకు అన్యాయం జరిందంటున్న వాళ్ళుగా మీకు యెవరు అన్యాయం చేశారో స్పష్తంగా చెప్పాల్సిన బాధ్యత మీదే గదా.సాక్ష్యధారాలు లేని అరోపణలకి విలువ ఉండదని చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతాడు.ముద్దాయిల పేర్లని ప్రకటించని అరోపణా పత్రాలూ అంతేనని మీకు తెలియదా?నేరం చేసినవాడు తను నేరం చేశానని ఒప్పుకుంటాడా అని దీర్ఘాలు తీసేవాళ్ళు అసలు నేరస్తుదు దొరకడని దొరికినవాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారా? విభజనకి యేకాభిప్రాయం అఖ్ఖర్లేదని అంతర్జాతీయ న్యాయసూత్రాలు చెబుతున్నాయంటున్నారు. అయితే, నువ్వు నీ చేతికర్రని యెంత గిరగిరా తిప్పుకున్నా అది నీ ఇష్తం. యెవడన్నా అడ్డుపెడితే నీ తరపున నేను పోట్లాడతా, నీ స్వేచ్చకి అడ్డుపడుతున్నాడు గాబట్టి. కాని నీ చెతికర్ర యెవడి ముక్కు కైనా తగిలితే మాత్రం వాడి తరపున నీతో పొట్లాదతా నన్నది కూడా అంతర్జాతీయ న్యాయసూత్రాల్లో ఉంది కదా.డిల్లీ అనే న్యాయమూర్తి నించి తీర్పు తెచ్చుకున్నామంటున్నారు, కానీ ఖచ్చితమైన అరోపణాపత్రమేదీ తీసుకోకుండా, సాక్ష్యాధారాల్ని పరిశీలించకుండా, పతికక్షుల వాదనల్ని వినకుండా కేవలం మాకన్యాయం జరిగిందని మీరంటున్న మాటనే సార్వకాలిక సత్యంగా ఒప్పేసుకుని తీర్పుని మీకనుకూలంగా ఫిరాయించేసిన ఆ తీర్పుకి చట్టబధ్ధత ఉంటుందా?

      2.ఆంధ్రోళ్ళు అట్టాంటోళ్ళు ఇట్టాంటోళ్ళు అనే ఈ చవకబారు మాటల్ని మీరు యధాలాపంగా వాడుతున్నారా లేక ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా?మీకు అన్యాయం జరిగిందని న్యాయపోరాటం చేస్తున్నప్పుడు అందులో భాగంగా మరొకరికి అన్యాయం చేసే ఈ వైరుధ్యాన్ని యెలా సమర్ధించుకోగలరు? మీరు మీకు జరిగినవిగా చెప్తున్న అన్యాయాలన్నిటికీ - దేశకాలాల్ని బట్టి చారిత్రక దృష్టితో చూస్తే - కాంగ్రెసు పార్టీయే కారణమని తెలుస్తుంది.పైగా ఆ అన్యాయాలు జరుగుతున్న కాలాల్లో మీ ప్రాంతపు శాసనసభ్యులు సభలోనే ఉన్నారు,మంత్రి వర్గంలోనూ ఉన్నారు, ముఖ్యమంత్రులుగానూ ఉన్నారు.అయినా సరే వాళ్ళు మీ ప్రాంతం వాళ్ళు కాబట్టి వాళ్ళ నొక్క మాట కూడా అనకుండా, ఆ నేరాలు చేసిన నేరస్తుడ్నే న్యాయమూర్తిగా నిలబెట్టి, "ఆంధ్రోళ్ళు" అని మీరంటున్న్ ప్రతిచోటా "కాంగ్రెసోళ్ళు" అని అనాల్సి ఉండగా, తిట్టాల్సిన వాళ్ళని వొదిలేసి తిట్టగూడని వాళ్ళని తిట్టటానికి కారణమేమిటి? ఒకప్పుడు "తెలంగాణాలో కవులున్నారా?" అని అన్నందుకు కించపడ్డామని చెబుతున్న మీరు చల్ల-మజ్జిగ లాంటి చెత్త మాటలతో సీమాంధ్రుల్ని కించపరచటాన్ని యెలా సమర్ధించుకుంటారు?ఇవన్నీ అనాలోచితంగా జరిగుతున్నవైతే క్షమాపణ చెప్పి ఆపెయ్యాలి. ప్రయత్న పూర్వకంగా చేస్తున్నవైతే పరిహారం చెల్లించి ఆపెయ్యాలి.మీరిప్పుడు ఈ రెంటిలో దేనికి సిధ్ధంగా ఉన్నారు?

      Delete
    4. 3.ఆర్టికిల్ 3తో ఒక్క దెబ్బకి ప్రత్యెక రాష్ట్రం వొచ్చేస్తుందని మీరనుకుంటున్నారా?కేంద్రం విడుదల చేసిన ప్రణాళిక ప్రకారమే చూసినా 12 దశలు ఉన్నాయి.అందులోని యే దశకీ నిర్ణీతమైన కాల పరిమితి లేదు.ప్రకటన జరిగిన 15 రోజుల్లో రావలసిన నోట్ రావటానికి యెంతకాలం పడుతుందో తెలియని పరిస్తితి ఉంది ఇవ్వాళ.రెండో దశ దగ్గిరే ఇంత అనిశ్చితంగా ఉంటే ఆ 12 దశలూ యెప్పటికి పూర్తవుతాయి.(ఈ కామెంటు అసలు పోశ్ట్ చేద్దామనుకోలేదు.ఇప్పుడు టేబుల్ నోట్గా వొచ్చింది. అయినా పరిస్తితిలో తేడా లేదు గనక యధాతధంగా వేస్తున్నాను).తొమ్మ్మిదేళ్ళుగా మీ ఉద్యమానికి అడ్డం రాని సీమాంధ్ర ప్రజలు ఇప్పుడెందుకు ఇలా అడ్డం పడ్డారో మీకూ తెలుసు. విభజన ప్రకటన జరగ్గానే ఒప్పుకోలు తో కూడిన నిశ్శబ్దం అందరిలోనూ ఆవరించటం మీకూ తెలుసు. ప్రకటన తెచ్చుకుని మీ కలని సాకారం చేసుకోవటానికి సీమాంధ్ర ప్రజల నుంచి కూడా సహకారం తీసుకునే స్నేహపూర్వకమైన ధోరణిని మీ నుంచి ఆశించారు.ఇక్కడా బ్లాగుల్లో నేను కూడా అదే చెశాను. ఉద్యమం వేడిలో - ఇన్నేళ్ళుగా ఉద్యమిస్తున్నా ఆశించిన ఫలితం దక్కని అయోమయం ఉన్నప్పుడు ఉద్రేకంలో - అంటున్నారని నేనూ పట్టించుకోలేదు. మీ స్థానంలో ఉంటే మీరే కాదు నేను కూడా అలాగే మాట్లాదతానేమో. మీరు కానీ నేను కానీ, ఇవ్వాళ సీమాంధ్రలో మీకు వ్యతిరేకంగా ఉద్యమం చెస్తున్నవాళ్ళు గానీ జడదారుల మేమీ కాదు. కానీ మీ ఉద్యమ ఫలితంగా మీ కలలు సాకారమయ్యే తొలి అడుగు పడిన తర్వాత కూడా అలాగే ఉండకండని,ఓడి పోయిన వాళ్ళని గిలిచిన వాళ్ళు అపహాస్యం చెయ్యకూడదని,వాళ్ళలో మీరు నిన్నటి రోజున యేర్పరిచిన భయాల్ని పోగొట్టి భవిష్యత్ కార్యాచరణకి కావలసిన సానుకూల వాతావరణాన్ని యేర్పర్చాల్సిన బాధ్యత మీదేనని మాత్రమే నేను మీకు చెప్పింది.దానికే నాకు - మీరు యేదైనా పార్టీకి పనిచేస్తున్నారా?మీరు కాంగ్రెసు ద్వేషియా? అనే ప్రతిస్పందన వచ్చింది.సానుకూలంగా స్పందించమనే సూచనల్ని కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నట్టుగా యెందుకు భావిస్తున్నారు మీరు? (కొత్తగా ఇప్పుడు షిందే గారు చెబుతున్న దాని బట్టి అస్లు యెక్కడా వోటింగుతో పని లేని పద్దతిని కాంగ్రెసు యెంచుకుందని తెలిసింది. తెలంగాణా ఇవ్వదానికి అవసరమయితే రాజ్యాంగ సవరనలు చెయ్యదానికి కూడా సిద్ధమయ్యేలా ఉంది. కానీ అలాంటివి జరుగుతాయా?ఆహార బిల్లునే వ్యతిరేకిస్తారని తెలిసిన వాళ్ళందరూ వోటు చెయ్యడానికి వీలు లేని పరిస్తితిలో ఉంది కాంగ్రెసు.)

      4.ఒకప్పుడు తెలంగానాలో కవులున్నారా అనే మాటకి కించపడ్డామని చెబుతున్న మీర్రు చల్ల-మజ్జిగ లాంటి తప్పుడు మాటల్ని మాకు అంటగట్టి కించపర్చటాన్ని యెలా చెయ్యగలుగుతున్నారు? రేపటి రోజున చట్టసభల్లో జరగబోయే చర్చల్లో ఇలాంటివి మరిన్ని రావొచ్చు. ఈ తిట్ల సెగ తగిలిన సీమాంధ్ర సభ్యులు వ్యతిరేకంగా వోటు చేస్తే అక్కడ తీర్మానం వీగిపోతే అప్పటి పరిస్తితి యేమిటి? అక్కడ జరిగే వోటింగుకి యెలాంటి ప్రాధాన్యమూ లేదా? అసలు వోటింగునే యెత్తేయ్యించుకోవటానికి ముందే హామీని పుచ్చుకున్న గ్యారెంటీ యేదైనా ఉందా? లేక అహార బిల్లుని ఫిరాయించుకున్నట్టు తెలంగాణా యేర్పాటుని వ్యతిరేకించే వాళ్ళందరినీ బహిష్కరించేసి సభలో ఉన్న వాళ్ళతోనే "మమ" అనిపించుకునే వ్యూహం ముందే రెడీ అయిపోయి ఉందా? లేని పక్షంలో యెదటి వాళ్ళ మనోభావాల గురించీ యేమాత్రమూ ఆలోచించని ఇలాంటి నిర్లక్ష్య ధోరణికి కారణమేమొటి? మాటి మాటికీ గతాన్ని తవ్వుకుని ప్రయోజనం లేదు.గతంలో యేం జరిగిందన్నది మర్చిపోయి ప్రకటన జరిగిన తర్వాత రాజ్యాంగ బధ్ధమైన వవహారాలన్నె సజావుగా జరిగేటందుకు కావలసిన వాతావరణాన్ని ప్రతిష్టించటం కోసం పడాల్సిన తొలి అడుగు మీ వైపు నుంచే పడాలి.ఆ తొలి అడుగు యెప్పుడు?

      Delete
    5. 5.తెలంగాణా విభజనకి సంబంధించి నేను యేది చెప్పినా - సత్య ధర్మ న్యాయ ప్రతిష్టితమైన నా గురు పరంపర, వ్యాస పరాశరాది షిర్డీ సాయినాధ పర్యంతం ఉన్న నా గురు పరంపర పాదాల సాక్షిగా - సత్యమే చెబుతున్నాను.భౌతిక పరమైన సత్యాల్ని నిరూపించటానికి ప్రయోగాలు చేస్తాము.సైధ్ధాంతిక పరమైన విషయాలకి తర్కమే గీటురాయి.తార్కిక పరమైన సత్యనిరూపణకి హిందూ ధర్మం లోని తర్క మీమాంసాదుల నుంచీ కమ్యూనిష్తుల గతి తార్కిక వాదం వరకూ అందరూ ఒప్పుకౌన్న పధ్ధతి వైరుధ్యాలు లేకపోవటం.ఆది నుంచీ నేటి దాకా నా కామెంట్లనీ దీనినే స్పష్తం చేస్తాయి. సీరియస్ విషయాల్లో చిలిపి తనం చూపించే అకటావికటపు మనస్తత్వం కాదు నాది. మిమ్మల్ని వెక్కిరించటం కానీ మీలో లేని లోపాల్ని అంటగట్టటం కానీ నేనెప్పుడూ చెయ్యలేదు.పైన అడిగీ ప్రశ్నలన్నీ మీరు మాట్లాడుతున్న మాటల్లోనివే, వాటిల్లొని వైరుధ్యాల్ని యెత్తి చూపించేవి మాత్రమే. ఇప్పుడు నాకు నేనుగా వేస్తున్న ప్రశ్న యేమిటంటే - తెలంగాణా సాధనకీ ఈ ద్వేషభాషకీ యేదైనా సంబంధం ఉందా? ఈ ద్వేషభాష లేని పధ్ధతి లో మీరు తెలంగాణాని సాధించుకోవటం కుదరదా? మీలోని వైరుధ్యాల్ని పరిష్కరించుకుని మీ వైఫల్యాలకి ఇతర్లని నిందించని పూర్తి న్యాయవంతమైన ఒక చక్కని రాజమార్గంలోకి తెలంగాణా ఉద్యమం యెప్పుడు ప్రవేశిస్తుంది?

      Delete
    6. >>చట్టసభల్లో జరగబోయే చర్చల్లో సమర్ధవంతంగా నిరూపించగలరా?

      మచ్చుకు ఒకటి చెప్పనా .. చంద్ర బాబు హయాంలో వచ్చిన గిర్గ్లాని రిపోర్ట్ ను చర్చించాలని ఆనాడు అసెంబ్లీలో తెలంగాణా వాదులు అడిగినను ఎందుకు చర్చించలెదొ చెప్పగలవా ? 610GO టైం పాస్ కి వేసారా? ఇప్పటికి ఒక వంద మందికి చెప్పి ఉంటాను మా సమస్యల లిస్టు, సాక్షాలు వగైరాలు. మీరు నుటొక్కటి, మీరు అయిపోగానే ఇంకో జోగి రామన్న ... ఆ తరువాత మళ్ళి ఇంకో ఎంకన్న. ఎంత మందికని చెప్పాలి ఇలా?

      >>యెవరు అన్యాయం చేశారో స్పష్తంగా చెప్పాల్సిన బాధ్యత మీదే గదా.

      వచ్చిన సమస్యే ఇది, గత పదేళ్లకు పైగా చెపుతున్నా వినక, ఇప్పుడు కూడా ఇంకా సమస్యలు ఏంటో తెలియని వారు తెలంగాణాను వ్యతిరేకిన్చాతమే. తెలంగాణా సమస్యలు మీకు ఇంకా తెలియదు అంటే
      1. మీకు ఆ సమస్యల గురించి చెప్పని మీ మీడియా తప్పు
      2. సమస్యలే లేవంటూ బొంకిన మీ నాయకుల తప్పు
      3. అసలు సమస్యే ఏంటో తెలియకుండా సమక్యవాదం(లేదా తెలంగాణా వ్యేతిరేకవాదం) భుజాన ఎత్తుకున్న మీలాంటి వారి తప్పు

      >>సాక్ష్యధారాలు లేని అరోపణలకి విలువ ఉండదని చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతాడు.

      ప్రభుత్వ కమిటి రిపోర్టులే సాక్షాలు, అవి కూడా కనబడని వారు గుడ్డి వారే.

      >>ముద్దాయిల పేర్లని ప్రకటించని అరోపణా పత్రాలూ అంతేనని మీకు తెలియదా?

      రామాయణం అంతా విన్నాకా ... అని ఎదో చెప్పేవారు. అలాగే ఉంది.

      >>కానీ ఖచ్చితమైన అరోపణాపత్రమేదీ తీసుకోకుండా, సాక్ష్యాధారాల్ని పరిశీలించకుండా, పతికక్షుల వాదనల్ని వినకుండా కేవలం మాకన్యాయం జరిగిందని మీరంటున్న మాటనే సార్వకాలిక సత్యంగా ఒప్పేసుకుని తీర్పుని మీకనుకూలంగా ఫిరాయించేసిన ఆ తీర్పుకి చట్టబధ్ధత ఉంటుందా?

      పైన మిరే చెప్పారు, నేరం చేసిన వారు రుజువయి నంత మాత్రాన ఒప్పుకుంటారా ?

      >>ఆంధ్రోళ్ళు అట్టాంటోళ్ళు ఇట్టాంటోళ్ళు అనే ఈ చవకబారు మాటల్ని

      అంద్రోల్లు అంటే చవక బారు పదమా? తెలుగులో అలాంటి అర్థం వస్తుందని తెలియదు.

      >>అందులో భాగంగా మరొకరికి అన్యాయం చేసే ఈ వైరుధ్యాన్ని యెలా సమర్ధించుకోగలరు?

      అదే ప్రశ్న తిరిగి అడిగితె మిరేమని చెప్పగలరు? ఇప్పుడు 'అన్యాయం' అని గగ్గోలు పెడుతున్న సీమండ్రులు అలాంటి అన్యాయాన్ని మరొకరికి ఎందుకు చేసారు?

      >>అన్యాయాలన్నిటికీ - దేశకాలాల్ని బట్టి చారిత్రక దృష్టితో చూస్తే - కాంగ్రెసు పార్టీయే కారణమని తెలుస్తుంది.

      తెలంగాణా కోటా కు చెందినా ప్రభుత్వ ఉద్యోగంలో ఓక సీమండ్రుడు చట్ట విరుద్దంగా చేరితే దానికి కాంగ్రేసు పార్టి మాత్రమె కారణం ఎలా కాగలదు? ఆ చట్ట విరుద్దమయిన పని కావటానికి సహకరించిన ప్రభుత్వ విభాగం, రాజకీయ విభాగం అందరిది ఆ తప్పు. తప్పు బయట పడ్డాక అది సరి చేస్తే తమ వర్గానికి నష్టం అవుతుంది అని ఆ తప్పును పట్టించుకోని వర్గానిది తప్పు.

      >> మీ ప్రాంతపు శాసనసభ్యులు సభలోనే ఉన్నారు,మంత్రి వర్గంలోనూ ఉన్నారు, ముఖ్యమంత్రులుగానూ ఉన్నారు.

      తప్పులు చేసిన వారిని వదిలి ఇదెక్కడి వాదన? అంటే మీ ఉద్దేశం ఈ అక్రమాలు అన్ని తెలంగాణా వారు ఎవ్వరు ప్రశ్నించకుండానే బయట పడ్డాయా?

      >>వాళ్ళు మీ ప్రాంతం వాళ్ళు కాబట్టి వాళ్ళ నొక్క మాట కూడా అనకుండా,

      మరి మీరు చేస్తున్నది ఏంటి? అన్యాయం చేసిన వాళ్ళు సీమండ్రులను వదిలి ఆ తప్పును ఇంకెవరి నెత్తినో వేసుకోమని చెప్పటం లేదా?

      >> చల్ల-మజ్జిగ లాంటి చెత్త మాటలతో సీమాంధ్రుల్ని కించపరచటాన్ని యెలా సమర్ధించుకుంటారు?

      చల్ల-మజ్జిగ అంటే చెత్త మాటలా? మీ తెలుగు జ్ఞానానికి నా నమస్కారం.

      Delete
    7. >>ఇవన్నీ అనాలోచితంగా జరిగుతున్నవైతే క్షమాపణ చెప్పి ఆపెయ్యాలి. ప్రయత్న పూర్వకంగా చేస్తున్నవైతే పరిహారం చెల్లించి ఆపెయ్యాలి.మీరిప్పుడు ఈ రెంటిలో దేనికి సిధ్ధంగా ఉన్నారు?

      హహ, సీమండ్రులు చేసిన దాని ముందు ఇదెంత. క్షమాపణలు/పరిహారాల దాక వెళ్ళితే సీమండ్రుల జీవితాలు సరిపోవు.

      >>తొమ్మ్మిదేళ్ళుగా మీ ఉద్యమానికి అడ్డం రాని సీమాంధ్ర ప్రజలు ఇప్పుడెందుకు ఇలా అడ్డం పడ్డారో మీకూ తెలుసు.

      అడ్డం ఎందుకు పడలేదో తెలియనిది ఎవ్వరికి? తెలంగాణా ఎన్నటికి రాదనీ అతి నమ్మకం. అందుకే తెలంగాణా వాదులతో ఏనాడు చర్చించటానికి ముందుకే రాలేదు ఈ సీమండ్రులు, పైగా ఎన్నో మాటలు, హేళనలు, కవ్వింపులు.

      >> సీమాంధ్ర ప్రజల నుంచి కూడా సహకారం తీసుకునే స్నేహపూర్వకమైన ధోరణిని మీ నుంచి ఆశించారు.

      what a joke. సీమండ్రులు సహకరిస్తారా? పరిస్తితి అలా ఉంటె అసలు రాష్ట్ర విజజనన అనే అవసరం వచ్చేదే కాదు.

      >>.ఒకప్పుడు తెలంగానాలో కవులున్నారా అనే మాటకి కించపడ్డామని చెబుతున్న మీర్రు

      అంతే అన్నారా? ఇంకేమయినా మీరు విని విననట్లు నటిస్తున్నారా? "చల్ల-మజ్జిగ " లాంటివి రాక ముందే తెలంగాణా వాదులు కించ పరచటం గురించి పుస్తకాలు రాసారు. అసలు సీమండ్రులు మొదలే పెట్టక పొతే ఈ గొడవ ఎక్కడిది? నొప్పి తెలుస్తుందా?

      >>సీమాంధ్ర సభ్యులు వ్యతిరేకంగా వోటు చేస్తే అక్కడ తీర్మానం వీగిపోతే అప్పటి పరిస్తితి యేమిటి?

      సీమంద్ర సభ్యులు వ్యతిరేకంగా ఓటు వెయ్యరు అనుకునే తెలంగాణా వాదులను ఒక్కరిని చూపగలరా? వారు సానుకూలంగా ఓటు వేస్తారని ఎవ్వరు ఆశ పెట్టుకొని లేరు. బాజాప తెలంగాణా ఏర్పాటును సమర్దించి నంత కాలం సీమంద్ర సభుయులు వ్యేతిరేకిస్తేవచ్చే నష్టం ఏమి లేదు.

      >> లేని పక్షంలో యెదటి వాళ్ళ మనోభావాల గురించీ యేమాత్రమూ ఆలోచించని ఇలాంటి నిర్లక్ష్య ధోరణికి కారణమేమొటి?

      మరొక ప్రాంతం మాకు కాలని గా పడి ఉండాలి అనుకునే దరిద్రపు మనోభావాలను ప్రస్తుత ప్రపంచంలో ఎవ్వరు సమర్దించరు.

      >>మాటి మాటికీ గతాన్ని తవ్వుకుని ప్రయోజనం లేదు.

      నిన్నటి జరిగింది కూడా గతమే, మీరు తవ్వటం లేదా కించ పరిచారు, అంచ పరిచారు అని? మీకు సౌకర్యంగా ఉంటె గతం మాట్లాడవచ్చు, లేనప్పుడు ప్రయజనం లేదని సలహాలా?

      >>మిమ్మల్ని వెక్కిరించటం కానీ మీలో లేని లోపాల్ని అంటగట్టటం కానీ నేనెప్పుడూ చెయ్యలేదు.

      "సీమండ్రులు" అని సంభోదిన్చినప్పుడు అది ప్రతి సీమంద్రుడిని అన్నట్లు కాదు, రాజకీయ పరిభాష అర్థం చేసుకోవాలి మీరు. పైన మీరు 'కాంగ్రేసు వారు' అన్నారు ,అంటే ప్రతి కాంగ్రేసు కార్యకర్త అని కాదు కదా? అలమెట్టి వలన కర్నాటక ఆంధ్రాలు కొట్టుకుంటున్నాయి అంటే, ప్రజలందరూ కొట్టుకుంటున్నారు అని కాదు కదా? అమెరికా వారు ధన వంతులు అంటే ప్రతి అమెరిక పౌరుడు ధన వంతుడు అని కాదు కదా అర్థం? బ్రిటిష్ వారిని తరమండి అని నినాదాలు ఇచ్చారు ఆ రోజుల్లో, అంటే ప్రతి బ్రిటిష్ వాడు మనకు శత్రువు కాదు కదా? కాటన్ విగ్రహం పెట్టుకున్నాం కదా? బ్రిటిష్ పార్లమెంటులో భారత స్వతంత్రాన్ని బలపరిచిన బ్రిటిష్ వారు కూడా ఉన్నారు కదా? 'రాజకీయ పరిభాషా' లో ఒక వర్గాన్ని ఉద్దేశించే మాట్లాడుతారు.

      Delete
  8. పైన నేను వేసిన కామెంటులో అనవసరమ్యిన తలకట్టుకి అవసరమయిన దానికంటే యెక్కువగా ప్రతిస్పందించి, తోకకి అహహ ఇహిహి అంటూ అరగంటలోనే జవాబిచ్చిన గాంగ్రీన్ స్టార్ గారు ఆ కామెంటులోని అతి ముఖ్యమయిన మధ్య భాగాన్ని వొదిలేసారెందుకో? యేమయినా ఆ కామెంటుకి అరగంటలోనే స్పందించిన వారు, తర్వాతి కామెంటుని ఇంతకాలం గడిచినా ముట్టుకోలేదేమి?

    ReplyDelete
    Replies
    1. మేమేమి మరీ పని లేకుండా కుర్చోలేదండి, మీకు అంత తొందరయితే ఎలా? అన్నిట్లోనూ తొందరేక్కువే ఉన్నట్లుంది.

      >>కామెంటులోని అతి ముఖ్యమయిన మధ్య భాగాన్ని వొదిలేసారెందుకో?
      ఏంటో అది ?

      Delete
    2. >>తర్వాతి కామెంటుని ఇంతకాలం గడిచినా ముట్టుకోలేదేమి?

      తొందర, అన్నింటిలోను తొందరే. అర గంటలో ఎదుటి వాని ఉద్యమం అంతా అర్థం అయిపోవాలి, ఎదుటి వారు పదేళ్ళు ఉద్యమం చేసినా మనం పది రోజులు చేస్తే ఎదుటి వాని ఉద్యమమం మట్టి కొట్టుకు పోవాలి, తెలంగాణా ప్రాంతానికి వెళ్ళగానే అలా లోకల్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇలా ప్రభుత్వ ఉద్యోగం కొట్టెయ్యాలి, ఇలా రాష్ట్రానికి ముక్య మంత్రిమి కాగానే అలా ఇచ్చిన మాటలు, ఒప్పందాలు తుంగలో తొక్కాలి, అన్నింటిలోను తొందరే. ఆకరికి మనం ఏదయినా కామెంటు రాయగానే ఎదుటు వాడు క్షణం ఆలస్యం చెయ్యకుండా తిరిగి కామెంటు రాయాలి.... ఓపిక అస్సలు ఉండదు, తొందర, అన్నింటిలోను తొందరే.

      Delete